హైదరాబాద్ లో నేటి నుంచి కఠినంగా ట్రాఫిక్స్ రూల్స్..ట్రిపుల్ రైడ్స్ రద్దు ?

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లో ఇవాల్టి నుంచి ట్రాఫిక్ రూల్స్ చాలా కఠిన తరం కానున్నాయి. మీద దాటితే తాటతీస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలో రాంగ్ రూట్ డ్రైవింగ్, నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

వారం రోజులుగా ఈ ఉల్లంఘన పై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ పై 1700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ పై 1200 రూపాయలు ఫైన్ వేయనున్నారు. ఈ ఉల్లంఘనల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చేపట్టిన అధ్యయనంలో తేలింది. దీంతో ఈ కఠినమైన ఫైన్లు తప్పవని పోలీసులు అంచనాకు వచ్చారు. దీంతో ఇవాల్టి నుంచి హైదరాబాద్లో పక్క ప్రణాళికతో పోలీసులు.