నేటి నుంచి తెలంగాణలో జాతీయ జెండాల పంపిణీ

-

5 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవవేడుకలను రాష్ట్రప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు ప్రజలకు అందించనుంది. ఇప్పటికే చేనేత, పవర్ లూం కార్మికుల ద్వారా తయారు చేయించిన తిరంగా జెండాలను జిల్లా కలెక్టర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. పట్టణాల్లో పురపాలకశాఖ, గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా త్రివర్ణపతాకాలను అందించనున్నారు.

జాతీయ జెండాల పంపిణీ కోసం రెండు శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. గ్రామాల్లో ప్రతి వంద ఇళ్లకు ఒకరు చొప్పున అధికారులు, సిబ్బందిని కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ… ప్రతి ఐదు గ్రామపంచాయతీలకు ఒకరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పంపిణీకి ప్రభుత్వం 14 వరకు గడువిచ్చింది.

సింగరేణి వ్యాప్తంగా ఇంటింటిపై జాతీయ జెండా ఎగర‌వేసేలా ఉద్యోగులు, పొరుగు సేవ‌ల సిబ్బందిని ప్రోత్సహించాల‌ని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సింగ‌రేణిభవన్‌లో హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్యక్రమం నిర్వహ‌ణ‌పై సమీక్షించిన అధికారులు 70వేల త్రివ‌ర్ణ ప‌తాకాల‌ను కొనుగోలు చేసిన‌ట్లు వెల్లడించారు. ఈ నెల 10 నాటికి సింగ‌రేణి వ్యాప్తంగా జాతీయ జెండాలు, పంపిణీ చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news