అక్కన్నపేట – మెదక్ ల మధ్య నిర్మించిన 17.2 కిలోమీటర్ల రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. మెదక్ – కాచిగూడ మధ్య ప్రయాణికుల రైలును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. మెదక్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే మొదటి రైలు కావడంతో జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రయాణికుల రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తో పాటు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో మెదక్ లో టిఆర్ఎస్ – బిజెపి పార్టీల పోటా పోటీ ఫ్లెక్సీలు నెలకొన్నాయి. కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తూ బిజెపి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. మెదక్ కి ట్రైన్ తెచ్చిన సీఎం కి కృతజ్ఞతలు అంటూ టిఆర్ఎస్ శ్రేణులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఫోటోలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టిఆర్ఎస్ శ్రేణులు.