గ్రూప్- 2, 3, 4 లో మరికొన్ని రకాల పోస్టులు చేర్చిన ప్రభుత్వం

-

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే గ్రూప్ సర్వీసుల్లో పోస్టుల భర్తీపై ప్రకటన చేసిన సర్కార్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. గ్రూప్- 2, 3, 4 లో మరికొన్ని రకాల పోస్టులు చేరుస్తూ నిరుద్యోగులకు తీపి కబురు అందజేసింది. ఏయే గ్రూపుల్లో ఏయే పోస్టులు చేర్చారంటే..?

- Advertisement -

గ్రూప్ -2 లో రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు రకాల పోస్టులు చేర్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో పోస్టులు, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు చేర్చింది.

గ్రూప్‌-3 లో మరో రెండు రకాల పోస్టులు యాడ్ చేసింది. గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు

గ్రూప్-4 లో మరో 4 రకాల పోస్టులు చేర్చుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేరుస్తూ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...