HCA రేప్‌ కేసులో ట్విస్ట్‌..యువతకి మద్యం తాగించి మరీ !

-

HCA సెంట్రల్ యూనివర్సిటీలో అత్యాచార యత్నం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన బాధిత విద్యార్థిని.. హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ బాధిత విద్యార్థిని కార్లో తీసుకెళ్లాడు ప్రొఫెసర్ రవి రంజన్. నేరుగా బాధితులని తన ఇంటికి తీసుకెళ్లిన ప్రొఫెసర్.. ఇంట్లో బాధిత యువతకి మద్యం తాగించాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు ప్రొఫెసర్.

భాదిత యువతి ప్రతిఘటించడంతో ఆమెను కొట్టిన రవి రంజన్.. తిరిగి బాధిత యువతని స్వయంగా కారులో తీసుకువచ్చి సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టాడు. నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్ పై మూడు కేసులు నమోదు అయ్యాయి. గత నెల రోజుల క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్ పై ఉపన్యాసం ఇచ్చిన రవి రంజన్.. గతంలో నమోదైన కేసులపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదంటున్నారు విద్యార్థులు.

Read more RELATED
Recommended to you

Latest news