ఈ ఏడాది కరోనా ఉండదు..మాస్క్‌ లేకుండా తిరగవచ్చు – పంచాంగం

-

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ఈ సంవత్సరం పంచాంగం చెప్పారు పండితులు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందింస్తుందని… అన్ని పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది… అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుతాయి. జలవృద్ధి అధికంగా ఉంటుందని చెప్పారు.ఈ సంవత్సరం పాడిపంటలు అద్భుతంగా ఉంటాయని… విద్యావకాశాలు మెరుగు పడుతాయని పంచాంగం చెప్పారు. విద్య రంగం లో సమూలమైన మార్పులు వస్తాయన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది పంటలు బాగా పండుతాయి… ఈ సంవత్సరం విష జ్వరాలు, కరోనా వంటి వ్యాధులు రావని పంచాంగం చెప్పింది. మాస్క్ లేకుండా ప్రజలు తిరుగవచ్చు…తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా అద్భుతంగా ఉంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news