జూలై 2న భాగ్య లక్ష్మి గుడికి యూపీ సీఎం యోగి

జూలై 2 న భాగ్య లక్ష్మి టెంపుల్ కు యూపీ సీఎం యోగి రానున్నారు. ఈ సందర్భంగగా భాగ్య లక్ష్మి టెంపుల్ లో పూజలు చేయనున్నారు యూపీ సీఎం యోగి. బీజేపీ నేషనల్ మీట్ కు హాజరు కానున్న యోగిని… భాగ్య లక్ష్మి టెంపుల్ కు రావాలని కోరారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు. గతంలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన యోగి… హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చాలని వాఖ్యలు చేశారు. అయితే.. జూలై 2 వ తేదీన యోగి భాగ్య లక్ష్మి టెంపుల్ కు రానున్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్
సీఎం యోగి ఆదిత్యనాథ్

ఈ సారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని… ఆయన పర్యటన పై సెక్యూరిటీ టైట్ చేయనున్నారు పోలీసులు. ఇక యోగి పర్యటనపై జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. భాగ్యలక్ష్మి గుడి కో… లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం తిప్పుడు కాదని.. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఎంటో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. యూపీ సీఎం యోగి భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్తున్నారు…భాగ్యలక్ష్మి అమ్మవారిని ఏమని మొక్కుత్తారు.. యోగి ప్రజల మనిషే అయితే… ప్రధాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని మొక్కు అని చురకలు అంటించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయిస్తా అని మొక్కు అని చురకలు అంటించారు.