మేడిగడ్డపై మంత్రి ఉత్తమ్‌కు చేరిన విజిలెన్స్ నివేదిక

-

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ ప్రాథమిక నివేదికను శనివారం రోజున రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు అందజేసినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణం నుంచి నిర్వహణ వరకు అడుగడుగునా లోపాలే ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2019లో బ్యారేజీని ప్రారంభించిన నాలుగు నెలలకే సమస్యలు తలెత్తాయని.. అయిదేళ్లుగా నిర్వహణా సక్రమంగా లేదని బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేర్కొంది.

బ్యారేజీ నిర్మాణం పూర్తయి ప్రారంభించిన రెండేళ్ల తర్వాత అంచనా విలువను రూ.1,353 కోట్లు పెంచినట్లు నివేదిక పేర్కొంది. డిజైన్‌ మొదలుకొని నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ అన్నింటిలోనూ సమస్యలున్నాయని.. ఇంజినీర్లు.. గుత్తేదారు ఏది కావాలంటే అది చేశారని తెలిపింది. బిల్లుల చెల్లింపు, పెరిగిన ధరల వర్తింపు, నిర్మాణ గడువు పొడిగించడం ఇలా ఏ విషయంలోనూ సరిగా వ్యవహరించలేదని వెల్లడించింది. పని పూర్తి స్థాయిలో కాకుండానే నీటి నిల్వ చేయడం గురించి కూడా విజిలెన్స్‌ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version