చంద్రబాబు బూట్లపై విజయసాయిరెడ్డి వివాదస్పద ట్వీట్

-

చంద్రబాబు బూట్లపై విజయసాయిరెడ్డి వివాదస్పద ట్వీట్ చేశారు. రెండు రోజుల కిందట వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టూర్‌ పై విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఫోటో షూట్ అనే పరామర్శకు వెళ్లిన బాబు గారి బూట్లు చూశారా? వరద రొచ్చులో కాలు పెట్టాల్సిన కర్మ ఏంటని 30 వేలు ఖరీదు చేసే జపనీస్ బ్రాండ్ asics వాటర్ ప్రూఫ్ స్నీకర్స్ వేసుకున్నారు. జర్మ్ ప్రూఫ్ కూడా …. లేకపోతే గోదావరి కలుషితం అయ్యే ప్రమాదం ఉండేదంటూ చంద్రబాబు ను ఎద్దేవా చేశారు.

బాబుని మంచి సైకియాట్రిస్ట్‌కు చూపించండి తెలుగు తమ్ముళ్లూ. రాష్ట్రం శ్రీలంక లాగా ఛిన్నాభిన్నం కావాలని పగటి కలలు కంటున్నారు. అర్జంటుగా జగన్ గారు దిగిపోవాలి. ఆ సీట్లో తాను కూర్చోవాలనేది ఆయన కోరిక. లంకలా జరిగితే బాగుండు అనే Obsessionలో చిక్కుకుపోయారని సెటైర్లు పేల్చారు. రాష్ట్రపతి వీడ్కోలు విందుకీ చంద్రబాబుకు ఆహ్వానం రాకపోవడంతో పచ్చమీడియా గొల్లుమంటోంది…అన్నయ్య స్థాయి అదేనని గుర్తించకుండా! దేశం ఇక ఉత్తర, దక్షిణ భారత్‌లుగా విడిపోతుందంటూ అందుకుంటుంది. చిత్ర విచిత్ర డిబేట్లతో రెండ్రోజులు శునకానందం పొందండని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news