యశ్వంత్ సిన్హాజీ గారు రాష్ట్రపతి బరి నుంచి తప్పుకోండి – విజయశాంతి

-

యశ్వంత్ సిన్హాజీ గారు రాష్ట్రపతి బరి నుంచి తప్పుకోండని విజయశాంతి కోరారు. ముర్ముజీ… ఒక ఉపాధ్యాయురాలు, గిరిజన మహిళ అని.. ఆమెపై పోటీ కన్నా, సమర్ధిస్తే యశ్వంత్ సిన్హాజీ కూడా అభినందనీయులవుతారని పేర్కొన్నారు.

1998 నుండి కొన్ని సంవత్సరాల పాటు అటల్‌జీ, అద్వానీజీ నాయకత్వంలో పనిచేసిన సాటి కార్యకర్తగా యశ్వంత్‌జీ కి నా అభిప్రాయాన్ని గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నానని.. ఏకాభిప్రాయ నిర్ణయం రాష్ట్రపతి ఎన్నికకు మరింత విలువ తేగలదు కదా… అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ఎటూ గెలుపు ఆవకాశాలు లేకపోవడం వాస్తవ దూరం కాదన్నది ఈ సందర్భంలో గమన్హారమన్నారు విజయ శాంతి.

ఇది ఇలా ఉండగా.. సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో వానాకాలం ప్రారంభమైంది. కానీ, ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం లోపించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ముగిసినా శివారు ప్రాంతాల పరిస్థితి మారలేదు. హాస్పిటల్స్‌లో…ఫీవర్ సర్వే నిర్వహించలేదు. దోమ తెరల పంపిణీ, మురికి గుంతల్లో గంబూజియ చేపల పెంపకం, యాంటీ లార్వా, ఆయిల్ బాల్స్, క్లోరినేషన్ ప్రక్రియ, ఫాగింగ్, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళిక వంటి కార్యక్రమాలు ఇంకా మొదలుకాలేదనిపేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news