మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే.. టీఆర్‌ఎస్ లోకి వలసలు పెరిగాయి. నిన్న దాసోజ్ శ్రవణ్, స్వామి గౌడ్ లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీజేపీ పార్టీ నుంచి మరికొంత మంది లీడర్లు టీఆర్‌ఎస్ లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ లోకి విజయశాంతి రానున్నట్లు కూడా ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే.. దీనిపై స్వయంగా విజయశాంతి క్లారిటీ ఇచ్చింది.
నాకు తెలంగాణ బీజేపీ నాయకత్వంతో సమస్యలు ఉన్నట్టు టీఆరెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఒక తీవ్రమైన కుట్ర. ఇది అవాస్తవమని తేల్చి చెప్పారు. ఒకవేళ అదే నిజమని ఎవరైనా భావిస్తున్నట్లయితే వారు ఒక నిజం తెలుసుకోవాలని చురకలు అంటించారు. నేను పనిచేసుకోవడానికి తెలంగాణతో పాటు నా బీజేపీలోనే అనేక దక్షిణాది, మరికొన్ని ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ నుండి వీడిపోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర బీజేపీతో దూరం వెళ్లిపోవాల్సినంత భేదాభిప్రాయాలు నాకేమీ లేవన్నారు విజయశాంతి.