దావోస్లో వాళ్ళకి మాకు పెళ్లి చూపులు అయ్యాయి.. లగ్న పత్రిక రాసుకున్నాం..ఇక మిగతా కార్యక్రమాలు అన్ని ముందున్నాయి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని తెలిపారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు.
ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారని అభినందించారు. పక్కా ప్రణాళికతో వెళ్లాం కనుకే అన్ని
పెట్టుబడులని వ్యాఖ్యలు చేశారు. 13 నెలల్లో రూ. లక్షా 80వేల కోట్ల పెట్టుబడులొచ్చాయని మరో సారి వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వం తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఇదో అద్భుత పరిణామంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టెంపుల్, ఎకో టూరిజంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయని.. రామప్ప, వేయి స్తంభాలగుడి లాంటి ప్రపంచ ప్రఖ్యాత మందిరాలు ఉన్నాయని చెప్పారు.