అవసరమైతే పార్టీని విలీనం చేస్తాం – కోదండరాం కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. అంతేకాకుండా అవసరమైతే తన పార్టీని విలీనం చేయడానికి కూడా సిద్ధమేనని సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేటలో తెలంగాణ జన సమితి మూడవ ప్లీనరీ సమావేశాలలో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.

kodandaram tjs – Telangana Janasamithi

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ జన సమితి పేరుతో 2018లో రాజకీయ పార్టీని స్థాపించిన కోదండరాం.. ఆ తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసిన విజయం సాధించలేదు. ఉప ఎన్నికలలోనూ తెలంగాణ జన సమితి అభ్యర్థుల ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ విలీనంపై చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఆ పార్టీని కాంగ్రెస్, లేదా బిజెపిలో విలీనం చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version