వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్య అతణ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా పైడిపల్లిలోని ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది. భార్య, ఆమె తరఫు బంధువులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
అసలేం జరిగిందంటే.. హనుమకొండలోని కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన జీవన్ అనే వ్యక్తి వరంగల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పని చేసి నాలుగేళ్ల క్రితం సస్పెన్షన్‌కు గురయ్యాడు. అదే సంస్థలో పని చేస్తున్న ఓ వివాహితతో అతడు తొమ్మిదేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అతడికి 2018లో వివాహమైంది. ప్రస్తుతం జీవన్ భార్యతో కలిసి హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. భార్యతో సరిగ్గా ఉండకపోవడంతో అనుమానమొచ్చిన భార్య అతడిపై నిఘా పెట్టింది. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకుంది. ఎలాగైనా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఆదివారం ఉదయం పైడిపల్లిలోని ఆర్టీసీ కాలనీలో ఉంటున్న మహిళ ఇంటికి జీవన్ వెళ్లాడు. అతడి వెనకాలే వెళ్లిన భార్య.. వారు గదిలో ఉండగా తలుపు గడియపెట్టింది. బంధువులు, పోలీసులకు సమాచారం అందించింది. బంధువులు ఇంట్లోకి వెళ్లి జీవన్‌కు దేహశుద్ధి చేశారు. భార్య అతడిని చెప్పుతో కొట్టింది. హసన్‌పర్తి పోలీసులు జీవన్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.