హైదరాబాద్ కు “వరల్డ్ గ్రీన్ సిటీ 2022” అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బృహత్తర ప్రణాళికలకు రూపకల్పన చేయనున్న కేసిఆర్…. హైదరాబాదు నగరానికి విస్తృత ప్రచారం చేయాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పట్టణాభివృధ్గి శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అరవింద్ కూమార్, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.
దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ నగరాల్లో, పట్టణాల్లో హైదరాబాద్ నగరం గొప్పతనాన్ని మరింతగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతిని సుస్థిరం చేసుకునేందుకు సమాలోచనలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తో పాటు, అనేక కార్పొరేట్ సంస్థ ల సహకారంలో ప్రచార ప్రణాళిక లు సిద్ధం చేసేందుకు సమాలోచనలు చేయనున్నారు.
పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు, పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, ప్రపంచవ్యాప్తంగా అమలుకు ప్రచార ప్రణాళికలు వేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని సుస్థిర “విశ్వనగరం” గా మార్చేందుకు ప్రపంచస్థాయ ప్రమాణాలతో మౌలిక వసతులు పెంచేందుకు ఆలోచనలు చేస్తున్నారు.