సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. మదమెక్కిన దొర గడి దాటి బయటకి రావడం లేదని వ్యాఖ్యానించారు. ఆందోళనలో ఉన్న 15,000 మంది టీచర్లకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
“పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తును చక్కదిద్దే గురువులు, ప్రగతి భవన్ ముందు పిల్లాపాపలతో ఆర్తనాదాలు చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చాడు సైకో KCR. 317జీవోను సవరించి న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కంట తడి పెడుతున్నా మదమెక్కిన దొర.. గడీ దాటి బయటికి రావడం లేదు. నీ రాక్షసత్వం పక్కనపెట్టి, బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలని, 2100మంది భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని YSRTP డిమాండ్ చేస్తోంది. స్థానికత కోల్పోతున్నామని ఆందోళనలో ఉన్న 15వేల మంది టీచర్లకు న్యాయం చేయాలని,బదిలీల్లో జీరో సర్వీసుకు అనుమతివ్వాలని కోరుతున్నాం” అన్నారు షర్మిల.