తెలంగాణ సంపదను పక్క రాష్ట్రానికి దోచిపెట్టడానికి సిగ్గుగా లేదా అంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ సంపదని.. అలాంటి సంపదను స్వార్థ రాజకీయాల కోసం మహారాష్ట్రకు దారదత్తం చేస్తావా? అని ప్రశ్నించారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు తరలిస్తే తన్ని తరుముతాం.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
శ్రీరామ్ సాగర్ నీళ్లు కేసిఆర్ సొంత ఆస్తి అయినట్టు ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. ” కెసిఆర్ తెలంగాణ అనే నామాన్ని ఇప్పటికే తీసేశారు. మీ రాజకీయాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ధారాదత్తం ఎలా చేస్తారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తెలంగాణ ఆస్తి. తెలంగాణ ప్రజలకు కెసిఆర్ సమాధానం చెప్పాలి. జై తెలంగాణ అనే దమ్ము కెసిఆర్ కి లేదు. కెసిఆర్ కు మహారాష్ట్ర రైతులే రైతుల? ఇక్కడ రైతుల మరణాలకు కేసీఆర్ బాధ్యుడు కాదా? ” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.