కెసీఆర్ ఒక హంతకుడు…ఆయనే సిగ్గుతో తలదించుకోవాలి : షర్మిల ఫైర్

సూర్యాపేట జిల్లాలో ఇవాళ వైఎస్ షర్మిల పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో నేరెడుచర్ల మండలం మేడారం గ్రామంలో నిరుద్యోగ యువకులతో వైఎస్ షర్మిల మాట్లాడారు. ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ పై నిప్పుచేరిగారు షర్మిల. కెసీఆర్ ఒక హంతకుడు అని.. తన పరిపాలన తీరుపట్ల ముఖ్యమంత్రి కెసిఆరే సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. తెలంగాణ కోసం నాడు 1200 మంది తమ ప్రాణాలు కోల్పోతే నేడు స్వరాష్ట్రంలో కూడా ఉద్యోగాల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు.

కెసీఆర్ కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ద ఉద్యోగ నోటిఫికేషన్ల మీద లేదని విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని… నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేడారం పర్యటన ముగించుకున్న వైఎస్ షర్మిల..  కొద్దిసేపటి కిందే హుజుర్ నగర్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో దొండపాడులో వైఎస్ అనుచరుడు గుణ్ణం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు షర్మిల.