వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆమెను చూసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో ఆమె ఇంట్లోనే హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి నుంచి విజయమ్మ లోటస్పాండ్ లోని ఇంట్లోనే ఉండగా.. షర్మిల అరెస్టుతో ఆందోళనకు గురైన విజయమ్మ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని చూశారు. కానీ పోలీసులు ఆమెను అక్కడే అడ్డుకున్నారు.
దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హౌస్ అరెస్టుకు నిరసనగా ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు వైఎస్ విజయమ్మ. ఇక షర్మిల అరెస్టు నిరసిస్తూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా తరలివస్తున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు, అభిమానులు. పోలీసులు వారిని చదరగొడుతున్నారు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మూడు సెక్షన్ల కింద వైఎస్ షర్మిలపై కేసులు నమోదు చేశారు. విఐపి రహదారిపై హంగామా చేసినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు.