చర్చించే దమ్ములేని దద్దమ్మలారా ! – వైయస్ షర్మిల ఫైర్

-

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు కూల్చివేశారు. ఈ ఘటనపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన జనం గుండెల్లో కొలువైన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్థానాన్ని ఎవరు కూల్చలేరని అన్నారు.

“ఖబడ్దార్.. YSR విగ్రహాలను కూల్చిన పిరికి పందల్లారా! ప్రజల్లో మీకు మొఖం చెల్లక.. మిమ్మల్ని ప్రజలు చీదరించుకుంటున్నారని.. అసహనంతో YSR విగ్రహాలను కూల్చుతున్నారా? YSR తెలంగాణ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక.. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దౌర్బాగ్యుల్లారా..ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము లేదు గానీ వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారా? మీకు దమ్ముంటే మాతో చర్చకు రండి..

చర్చించే దమ్ములేని దద్దమ్మల్లారా.. మీరు విగ్రహాలు కూల్చినంత మాత్రాన.. జనం గుండెల్లో కొలువైన వైయస్ రాజశేఖర రెడ్డి గారి స్థానాన్ని ఎవరూ కూల్చలేరు.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వైయస్ఆర్ విగ్రహాన్ని కూల్చిన వెధవలను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. ఈ చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని .. మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news