తుఫాన్ కు కొట్టుకుపోయిన దేవాలయం… వీడియో వైరల్

-

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘అసని ‘ తుఫాన్ వల్ల తీరప్రాంతం అలజడిగా ఉంది. అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను కారణంగా ఓ మందిరం తీరానికి కొట్టుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. అసని తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం గా దీనిని భావిస్తున్నారు. అసని తుఫాన్ ప్రభావంతో ఇది సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. అక్కడి ప్రజలు దీనిని వీక్షించేందుకు ఎగబడుతున్నారు.

ఈ వింతైన రథం మంగళవారంనాడు కొట్టుకు వచ్చింది. ఈ రథం పై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించబడి ఉంది. ఇది మలేషియా థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినవి అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకు తిట్లి వంటి పెద్ద తుఫాను వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రధాలు సముద్రంలో కొట్టుకు రాలేదంటున్నారు. దీనిని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చిందనే విషయం తెలియాల్సి ఉంది. బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకు రావడంతో స్థానికులు వింత అనుభూతికి లోనవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news