ఏపీలో మరో దారుణం..2వ తరగతి బాలికపై లైంగికదాడి

-

మృగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అన్యం పుణ్యం తెలియని చిన్నారుల నుంచి.. రేపో మాపో అన్నట్లుండే ముసలి వాళ్ళ వరకు ఎవ్వరినీ కామాంధులు విడవడం లేదు.. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి అన్ని దారులు వాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలను తెచ్చినా.. కామాంధులు ఎక్కడా తగ్గడం లేదు.

మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. 2 వ తరగతి చదువుతున్న ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ దారుణమైన సంఘటన అనకాపల్లిలోని… చోడ వరంలో చోటు చేసుకుంది.

2వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను అత్యాచారం చేశారు 18 ఏళ్ల యువకుడు. ఈ ఘటన గురించి తెలియగానే… స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక బంధువులు. దీంతో విచారణ చేపట్టిన చోడవరం పోలీసులు.. నిందితున్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news