గత కొంతకాలంగా అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్ కు గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెరెనా తాజాగా చేసిన ట్వీట్ కూడా దీనికి ఊతమిచ్చింది. ఈ క్రమంలో ఈ స్టార్ ప్లేయర్ తాజాగా చేసిన ఓ ప్రకటన తన ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేసింది. తాను టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు సెరెనా విలియమ్స్ ప్రకటించింది.
యుఎస్ ఓపెన్‌లో ఓటమితో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన సెరేనా అమెరికా ఓపెన్ మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అజ్లా టోమ్లానోవిక్ చేతిలో పరాజయం పాలైంది. సెరెనాపై అజ్లా 7-5, 7-5, 6-7, 6-1 తేడాతో విజయం సాధించింది. ఓటమి అనంతరం కన్నీరు పెట్టుకున్న సెరెనా ఇది తన జీవితంలో అపురూపమైన ప్రయాణమని తెలిపింది.
తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈనెలలో 41వ పుట్టినరోజు జరుపుకున్న సెరెనా ఆటలకు దూరంగా నూతన జీవితం ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే టెన్నిస్ నుంచి రిటైర్ అనే పదాన్ని చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు.