జమ్మూకాశ్మీర్‌లో టార్గెట్ మార్చుకున్న ఉగ్రవాదులు..ఆ పార్టీ నేతలపై టెర్రరిస్టుల ఫోకస్‌.!

-

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు..గత కొంత కాలంగా వారి టార్గెట్ మార్చుకుని..రాజకీయ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు..ముఖ్యంగా అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారు..తాజాగా క‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు..ఈ కాల్పుల్లో ముగ్గురు బీజేపీ కార్య‌క‌ర్త‌లు మృతిచెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. వైకే పోరా గ్రామంలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన‌ట్లుగా పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో సీనియ‌ర్ పోలీసు అధికారులు టెర్ర‌ర్ క్రైమ్ స్పాట్‌కు చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్ల‌డైంద‌న్నారు పోలీసులు. మృతుల‌ను ఫిదా హుస్సేన్, రషీద్ బీగ్, ఉమర్ హజామ్‌గా పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version