ప్రస్తుతం తెలంగాణాలో మరొక సంచలన విషయం విద్యార్థుల తల్లితండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు నుండి తెలంగాణాలో టెన్త్ క్లాస్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్నా తరుణంలో… పరీక్ష స్టార్ట్ అయిన కొంత సేపటికే తెలుగు పేపర్ వికారాబాద్ జిల్లా తాండూరు లో వాట్సాప్ గ్రూప్ లలో ప్రత్యక్షము కావడం కలకలం సృష్టించింది. దీనిపై అప్పుడే ఆందోళనలు డిమాండ్ లు మొదలయ్యాయి. కానీ వికారాబాద్ జిల్లా ఏఎస్పీ మురళి ఈ విషయం పై స్పందిస్తూ… అందరూ అనుకుంటున్నట్లు టెన్త్ క్లాస్ తెలుగు పేపర్ ఎక్కడా లీక్ కాలేదని… తాండూరు గవర్నమెంట్ స్కూల్ ఇన్విజిలేటర్ బందెప్ప ఉదయం 9 .37 గంటలకు తెలుగు పేపర్ ను వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు.
అయితే ఆ సమయానికి పరీక్షకు విద్యార్థులు అంతా హాల్ లోనే ఉన్నారని అన్నారు. బందెప్ప చేసిన పనికి అతనిని అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ మురళి తెలిపారు. దీని వెనుక ఇంకేమైనా రహస్యాలు ఉన్నాయా అన్నది విచారణ తర్వాత వెల్లడిస్తామని ఏఎస్పీ మురళి స్పష్టం చేశారు.