గత రెండు ఐపీఎల్ లో ఎక్కువ క్రేజ్ సంపాధించికున్న ఆటగాళ్లలో దేవదత్ పడిక్కల్ ముందు వరుసలో ఉంటాడు. ఈ 21 యువకుడు ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. గత ఏడాది పడిక్కల్ 14 మ్యాచ్ లు ఆడి 411 పరుగులు చేశాడు. అలాగే ఒక సెంచరీని కూడా నమోదు చేశారు. అలాగే ఐపీఎల్ 2020 లో ఏకంగా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే తాజా గా పడిక్కల్ తను భారీ స్కోర్ చేయడానికి గల కారణాన్ని చెప్పేశాడు.
ఆర్సీబీ తరుపున ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లి మరో ఎండ్ లో మరో ఎండ్ లో ఉండేవాడని.. దీంతో బౌలర్లు మొత్తం కోహ్లి పైనే దృష్టి సారిస్తారని అన్నాడు. దీంతో తాను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసుకునే అవకాశం దక్కేదని అన్నారు. కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేస్తే.. ఇది ఒక లాభం అని దేవదత్ పడిక్కల్ అన్నాడు. అయితే ఐపీఎల్ 2022 కోసం జరగబోయే మెగా వేలానికి ముందు జరిగిన రిటేన్షన్ ప్రక్రియలో ఆర్సీబీ అనుహ్యంగా దేవదత్ పడిక్కల్ ను వదులుకుంది.
దీంతో దాదాపు అన్ని ఫ్రొంచైజీలు పడిక్కల్ పై కన్ను వేశాయి. పడిక్కల్ ను దక్కించుకునేందుకు ఎంత డబ్బు అయిన ఖర్చు చేయడానికి ఫ్రొంచైజీలు సిద్ధం అవుతున్నాయి. కాగ ఈ మెగా వేలంలో పడిక్కల్ రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు.