ఎన్నికల్లో పుష్ప హంగామా.. కేంద్ర మంత్రి నోట పుష్ప డైలాగ్

-

పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలన కలిగించిందో తెలిసిన విషయమే. ఇందులోని డైలాగులు ముఖ్యంగా ‘తగ్గేదే లేదు’ అంటూ బన్నీ చేసి హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ డైలాగ్ అందరికి ఊతపదంగా మారింది. మరోవైపు శ్రీవల్లి సాంగ్ దేశవ్యాప్తంగా మంచి ఫేమస్ అయింది. చిన్నపెద్ద అన్న తేడా లేకుండా అందరి నోట పుష్ప డైలాగులు, సాంగ్స్ వినిపిస్తున్నాయి. క్రికెటర్ల దగ్గర నుంచి సాధారణ వ్యక్తుల దాకా అంతా పుష్ప సినిమాలోని డైలాగులు, సాంగ్స్ తో రీల్స్ చేస్తూ.. తెగ సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కూడా పుష్ప సినిమా డైలాగులు, సాంగ్స్ పేలుతున్నాయి. ఇటీవల యూపీలో కాంగ్రెస్ పార్టీ పుష్పలోని శ్రీవల్లీ సాంగ్ ట్యూన్ తో ఏకంగా యూపీ గొప్పతనాన్నిచెబుతూ.. ఓ సాంగ్ ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నోటి నుంచి పుష్ప డైలాగ్ వచ్చింది. నిన్న ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పాల్గొన్న ఆయన పుష్ప సినిమాలోని డైలాగ్ తో ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ పుష్కర్ ను ఓ పువ్వుగా భావిస్తోందిని.. అయితే ‘ అప్నా పుష్కర్ ఫ్లవర్ భీ హై ఔర్ ఫైర్ భీహై( మా పుష్కర్ పువ్వు మరియు నిప్పు) అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news