వైసిపి పార్టీ ఒక ఉగ్రవాద శిక్షణా కేంద్రం.. పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ” 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ” అంటూ తన డైలాగుతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు పృథ్వీరాజ్. ఇటీవల కాలంలో కాంట్రవర్సీ లకు గురి అవుతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే వైసీపీలోకి చేరిన తరువాత పృధ్వీరాజ్ టీ డీ పీ పార్టీని ఎన్నోరకాలుగా తన మాటలతో విమర్శించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ వైసిపి పార్టీ ఒక ఉగ్రవాద శిక్షణ కేంద్రం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.CM Jagan Reddy warns SVBC Chairman Prudhvi Raj for casteist remarks on farmers

ఇకపోతే ప్రముఖ ఏబీఎన్ ఛానల్ కి.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రమంలో పాల్గొన్న పృధ్వీరాజ్ వైసిపి పార్టీ గురించి తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వెల్లడించారు. వైసిపి పార్టీలో కులగజ్జి ఎక్కువగా ఉంది అని.. ఒకవేళ నా పేరు వెనుక రెడ్డి అని ఉన్నా కూడా నేను అక్కడే ఉండి పోయే వాడినేమో.. నా పేరు వెనుక రెడ్డి లేదు కాబట్టి నాకు అంత గౌరవం ఇవ్వలేదు అంటూ ఆయన తెలిపారు. నిజానికి పృథ్వీరాజ్ రాజకీయాలలో అంత బాగా వైరల్ అవడానికి కారణం వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల పార్టీల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి వారి పై దారుణంగా తన మాటల తూటాలు విసిరాడు అని చెప్పవచ్చు.రాఘవేంద్రరావు స్థానంపై కన్నేసిన 30 ఇయర్స్ పృథ్వీ.. వైఎస్ జగన్ సౌజన్యంతో.. | Comedian 30 Years Prudhvi met AP CM YS Jagan and He will be elected as SVBC Chairman pk..– News18 Telugu

ఇక తన స్థాయికి మించి ఆయనను ఎస్ వి బి సి చైర్మన్ చేశారు . కానీ ఒక మహిళ ఉద్యోగితో వెనుక నుంచి పట్టుకుంటే అంటూ అసభ్యకరమైన ఫోన్ కాల్స్ బయటకు రావడంతో పదవి నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుంచి పృధ్వీరాజ్ ను పార్టీ నుంచి పక్కన పెట్టడం.. పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం.. ఇలా పూర్తిగా దూరం పెట్టారు. ఇక జగన్ మోహన్ రెడ్డి ని ఎప్పుడూ కలవలేదు అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన దగ్గరకు వెళితే ఆ చెప్పండి ఏమిటి అంటూ అహంకారంగా తనతో మాట్లాడినట్లు పృథ్వి రాజు వెల్లడించారు. ఇకపోతే పార్టీలో చేరడానికి అక్కడి నాయకులు ఏవేవో చెప్పి తన బ్రెయిన్ వాష్ చేశారు అని రెడ్డి కాదు అని తెలిసే సరికి పూర్తిగా నన్ను దూరం పెట్టారు.. వైసిపి పార్టీ ఒక ఉగ్రవాద శిక్షణా కేంద్రం అంటూ పృథ్వీరాజ్ ఆరోపణలు చేశాడు .ఇక ప్రస్తుతం 2024లో వచ్చేఎన్నికలలో జనసేన పార్టీలోకి చేరబోతున్నట్లు కూడా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news