మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఉత్తమ మార్గాలివి..!

-

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి. అప్పుడు కచ్చితంగా మానసిక ఆరోగ్యం బాగుంటుంది వీటిని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మెగ్నీషియం:

మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మెగ్నీషియం ని డైట్ లో తీసుకుంటే రిలాక్స్ గా ఉండొచ్చు. నెర్వస్ సిస్టం అంతా కూడా బాగుంటుంది. వాల్నట్స్, అరటి పండ్లు, ఆప్రికాట్ లో ఇది ఎక్కువగా ఉంటుంది.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. చియా సీడ్స్, ఫ్లేక్ సీడ్స్, నెయ్యి వంటివాటిలో ఇది ఉంటుంది.

విటమిన్ బి:

విటమిన్ బి ను తీసుకోవడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది నెర్వస్ సిస్టం బాగా ఫంక్షన్ అవుతుంది. ఆకుకూరలు పల్లీలలో ఇది ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ డి:

విటమిన్ డి ని కూడా అధికంగా ఉండేటట్లు చూసుకోండి. దీని వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పుట్టగొడుగులు, గుడ్లు వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది ఇలా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మానసికంగా దృఢంగా ఉండొచ్చు మానసిక ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news