పాలు పోయగానే లేచి కూర్చున్న శవం..దేవుడు మాయే..!

-

ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారు అనే వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి..కొన్నిసార్లు వారు డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఉలుకు పలుకు లేకుండా వెళ్ళిపోతారు మళ్ళీ కొద్ది సమయంలో మళ్ళీ లేస్తున్నారు.తాజాగా మరో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది..మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైన తరుణంలో.. శవం నోట్లో ఆఖరు సారి పాలు పోసే ప్రయత్నం చేశాడు చనిపోయన వ్యక్తి కొడుకు. నోట్లో పాలు పోయగా వెంటనే శవం లేచి కూర్చుంది.

అది చూసి అంత్యక్రియలకు వచ్చిన వారు షాకయ్యారు. ఈ వింత సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని పుదుకోట జిల్లా, ఆలంపట్టి మురండాంపట్టి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు షణ్ముగం..గత కొన్ని రోజులుగా గుండె, లివర్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. తండ్రి ఆరోగ్యం కుదుటపడాలని అతడి కొడుకు అయ్యప్ప మాల వేసుకున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం షణ్ముగం పరిస్థితి విషమించింది. దాంతో.. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని పొన్నమరావతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు తమ వల్ల కాదని చెప్పడంతో కుటుంబ సభ్యులు షణ్ముగాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు.

ఇక అతడి కుమారుడు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెల్లెందుకు రెడీ అయ్యాడు.అతడిలో చలనం లేదని గమనించి కుటుంబ సభ్యులు అతడు చనిపోయాడని భావించి.. బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇక షణ్ముగం చనిపోయాడని చెప్పడంతో.. బంధువులు అతడి ఇంటికి వచ్చి.. కుటుంబ సభ్యులను ఓదార్చడం ప్రారంభించారు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న క్రమంలో వారి ఆచారం ప్రకారం షణ్ముగం కొడుకు చివరిసారిగా తండ్రి నోట్లో పాలుపోశాడు. ఆ పాలు నోట్లోకి వెళ్లీ వెళ్లగానే.. ఒక్కసారిగా దగ్గుతూ షణ్ముగం కళ్లు తెరిచాడు.దాంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

ఆనందంతో అతని కుటుంబసభ్యులు ఏం జరుగుతుందో తెలియక షాక్ లోనే ఉండిపోయారు. ఆ తర్వాత తేరుకుని.. చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి బతికినందకు అందరూ సంతోషించారు.ఆయన చనిపోయారని భావించి బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారని డాక్టర్లు చెబుతున్నారు. అంబులెన్స్ గ్రామానికి సమీపంలో ఉన్నప్పుడు ఆయన స్పృహ కోల్పోయారని, కొడుకు పాలు పోయగానే లేచారని వివరిస్తున్నారు. బంధువులు, స్థానికులు మాత్రం మనసులో ‘స్వామియే శరణం అయ్యప్ప..అంటూ దేవుడు మాయ అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news