ఆకాశంలో విమానం ఉండగా తెరుచుకున్న డోర్.. వీడియో వైరల్‌..!

-

ఫ్లైట్‌ ఎక్కాలని చాలామందికి ఉండే కోరిక.. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఆ ఆనందమే వేరు.. అదేదో సినిమాలో అన్నట్లు.. ఫ్లేట్‌ ఎక్కలాంటే అదృష్టం ఉండాలి…అలాగే దిగాలన్నా కూడా అదృష్టం ఉండాలి. అన్నట్లు…ఏమైనా జరగొచ్చు..ఎంత జాగ్రత్తలు తీసుకున్నా..అప్పుడప్పుడు కొన్ని ఘటనలు జరుగుతుంటాయి.. ఇప్పుడు జరిగింది కూడా ఓ విచిత్రమైన ఘటన..ఇలాంటివి ఇంతకు ముందు జరిగినట్లు మీరు ఎప్పుడూ, ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. రష్యాకు చెందిన ఒక ఛార్టర్డ్ ఫ్లైట్ ఆకాశంలో కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే డోర్ తెరుచుకుంది.. ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు అవి. విమానం ఆకాశంలో ఉండగానే డోర్ తెరవడంతో విమానంలో ఉన్న గాలి అంతా ఆకాశంలోకి వెళ్లింది…దీంతో విమానంలోని లగేజీ సైతం గాలిలోకి పీల్చుకుంది.

అసలేం జరిగిందంటే..

క్యారియర్ ఐర్ఏరో అనే ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్రొపెల్లర్ విమానం సైబీరియాలోని మగన్ నుండి రష్యాలోని పసిఫిక్ తీరంలో ఉన్న మగడాన్‌కు బయలుదేరింది. విమానం మగడానికి వెళ్తుండగానే మార్గం మధ్యలోనే విమానం వెనుక తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంది. విమానంలో ఆ సమయంలో ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణీకులలోనే ఒకరు విమానం వెనుక తలుపు తెరుచుకున్నప్పుడు ఏం జరిగిందనే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. ఆ తర్వాత పైలట్ ఎలాగోలా మళ్లీ విమానాన్ని వెనక్కి తీసుకెళ్లి మగన్‌లోనే ల్యాండ్ చేశాడు. క్యారియర్ ఐర్ఏరో ఎయిర్ లైన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2800-2900 మీటర్ల ఎత్తులో విమానం తలుపు తెరుచుకుంది. వైరల్‌గా మారిన ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలహాదారు ఆంటన్ గెరాష్‌చెంకో కూడా ట్విటర్‌లో షేర్ చేశారు. విమానం డోర్‌ తెరుచుకున్నా, లేక విండో తెరుచుకున్నా..బయటిగాలి లోపలికి రావడం, లోపలి గాలి బయటకు వెళ్లడం వల్ల విమానం బ్యాలెన్స్‌ తప్పుతుంది. పైలెట్‌ ఎంత మ్యానేజ్‌ చేసినా కొన్నిసార్లు పరిస్థితి చేయదాటితే.. విమానం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news