రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 326 రన్స్ చేసింది. క్రీజులో జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, హార్ట్ ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకి ఆదిలోనే షాక్ తగిలింది. వైజాగ్ టెస్టులో ద్వి శతకంతో మెరిసిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10) మార్క్ వుడ్ బౌలింగ్ లో స్లిప్‌లో ఉన్న జో రూట్ చక్కని క్యాచ్ పట్టడంతో యశస్వీ డగౌట్‌కు చేరాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. వైజాగ్ టెస్టులో ఆకట్టుకున్న రజత్ పాటిదార్(5)ను టామ్ హర్ట్లే ఔట్ చేసి భారత్ ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
33 రన్స్ కే మూడు కీలక వికెట్లు పడడంతో ఇంగ్లండ్ టీం మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే.. కెప్టెన్ హిట్ మ్యాన్ తన సహజ ఆటను పక్కనపెట్టి నిదానంగా ఆడుతూ.. రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.కెప్టెన్ రోహిత్ శర్మ (131), జడేజా (110*) సెంచరీలతో చెలరేగారు. కెరీర్లో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ 62 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.