భార్యాభర్తలు ఎప్పుడూ కలిసే ఉండాలి ఒకరి కోసం ఒకరు బతకాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అవును కరెక్టే, కానీ అలా వారు చెప్పడం వెనుక ఒక కారణం ఉంది. భార్యకి, భర్తకి కానీ ఏదైనా ఒక కష్టం వస్తే ఆ సమయంలో ఇద్దరు కలిసి తోడు నీడలా ఉండాలి. లేదా ఏదైనా ఆనందాన్ని పంచుకోవడానికి ఇద్దరు కలిసి ఉంటే అది చూడడానికి ఎంతో బాగుంటుంది. మరి అన్నిసార్లు కలిసే ఉంటే వచ్చే ఆనందం కన్నా కొన్నిసార్లు పార్ట్నర్ కి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. మరి వారు ఎందుకు అలా చెప్తున్నారు మనము తెలుసుకుందాం..
మన మనసుకి ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు, ఎదురుగా ఎవరున్నా సరే వారితో మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండిపోతాం. ఇలా చేయడం వల్ల మన మనసుకి కాస్త రెస్ట్ దొరుకుతుంది. మరి ఇలానే శరీరానికి బాగా ఇబ్బంది అనిపించినప్పుడు, ఆరోగ్యం కొంచెం దెబ్బతింది అని అనుకున్నప్పుడు రెండు రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల శరీరానికి కాస్త రెస్ట్ దొరుకుతుంది. మరి ఇలాంటివి మీ రిలేషన్ షిప్ లో కూడా ఉండడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎప్పుడు భార్యా భర్త కలిసే ఉండడం మంచిదే అయినప్పటికీ కాస్త వారి మధ్య దూరం ఉంటే కొన్ని విషయాలను ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది.ఇక అంతేకాక మీ యొక్క రిలేషన్షిప్ మీరు తిరిగి కలిసినప్పుడు ఎంతో స్ట్రాంగ్ గా మారుతుంది. కాస్త దూరం.. మీరు కలిసిన తర్వాత మరింత ప్రేమగా మారుతుంది.
ఇష్టమైన పని చేయడం : ఆడవారు ఎక్కువగా పెళ్లి కాక ముందు ఒక లైఫ్ ను,పెళ్లి అయిన తర్వాత మరో లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. చాలామంది భాగస్వామి కోసం వారి కోరికల్ని ఇష్టాలని మార్చేసుకుంటారు. చివరికి కొంతమంది వాళ్ళు కు ఇష్టమైన ఫుడ్ ని కూడా మార్చుకుంటారు. భాగస్వామి ఏం కోరుకుంటున్నారు వారికి ఏది ఇష్టం అదే చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. వారికి ఇష్టమైన విధంగా లైఫ్ ని రన్ చేస్తూ ఉంటారు. దీంతో వారికి నచ్చిన జీవితాన్ని కోల్పోతున్నారు. ఇది పెళ్లయిన కొత్తలో చాలా బాగుంటుంది కానీ కొన్ని రోజులు తర్వాత, ఒంటరిగా ఒక రోజు కూర్చుని ఆలోచించినప్పుడు ఏం కోల్పోయాము అన్నది అర్థమవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే కొన్ని రోజులు, పార్ట్నర్ కి దూరంగా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లడం లేదా ఒక్కరే ఏదైనా టూర్ కి వెళ్లడం, లేదా పుట్టింటికి వెళ్లడం, ఎక్కడైతే మీకు రెస్ట్ దొరుకుతుందో ఆ ప్లేస్ ని మీరు ఎంచుకొని పార్టనర్ కి దూరంగా కొన్ని రోజులు గడిపి మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది.
బాధ్యతలు, ఒత్తిళ్లకు దూరం: ప్రతి స్త్రీ పెళ్లయిన తర్వాత పిల్లలు, ఆఫీస్ పనులు ఇంటి పనులు అత్తమామల పనులతో నలిగిపోతుంటారు. అన్నింటినీ మెయింటినెన్స్ చేస్తూ వారు ఒత్తిడికి గురవుతారు. పైకి మాత్రం ఏమీ కనిపించినట్లు సహజంగా కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి పార్ట్నర్ తో గొడవకి కూడా దిగుతారు. మరి ఇలా గొడవలు పడకుండా ఉండాలి అంటే కాస్త రెస్ట్ తీసుకోవడం అవసరం. మనకి నచ్చిన పనులను చేయడం నచ్చినట్లుగా ఉండడం, హాయిగా నిద్రపోవడం, నచ్చిన ఆహారం తినటం, ఇలా మీ లైఫ్ ని మీకు నచ్చినట్లుగా ఓ రెండు రోజులు ఉంటే తిరిగి మళ్ళీ మీ లైఫ్ లోకి హ్యాపీగా వెళ్ళిపోతారు.
ఎక్కువమంది భాగస్వామితో కలిసి ఉండడం ఇష్టపడతారు కానీ ఒక్కసారి ఒక రోజు, మీ భాగస్వామికి దూరంగా ఉండి తిరిగి తన వద్దకు చేరుకున్నప్పుడు ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. మిమ్మల్ని మీ పార్టనర్ కి మరింత దగ్గర అయ్యేలా చేస్తుంది. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి వచ్చే మార్పు మీకే తెలుస్తుంది.