నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరుగనుంది. టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు ఆధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఉ .10:30 గంటలకు సమావేశం జరుగనుంది. మొత్తం 45 అంశాలపై చర్చించనుంది టీటీడీ బోర్డు. టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యూలరైజ్ చేసే ఆంశంపై చర్చించి.. తీర్మానం చేయనుంది బోర్డు.

తిరుమలలోని పాత భవనాలను నూతన డోనర్ స్కీమ్ క్రింద పునర్నిర్మించే ఆంశంపై చర్చించనుంది పాలక మండలి. వేద పారాయణదారులకు నిరుద్యోగి భృతి క్రింద నెలకు రూ.3 వేలు అందజేయాలనే తీర్మానంతో పాటు పలు కీలకాంశాలపై చర్చించనుంది బోర్డు.