నందమూరి హీరో తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 3 వారాలకు పైగానే అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆయన హెల్త్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు కానీ ఇప్పటివరకు ఆయన మాత్రం స్పృహలోకి రాలేదు. మూడు వారాలు అవుతున్నా.. ఆయన స్పృహ లోకి రాకపోవడానికి కారణం ఏంటి అనే విషయం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. తారకరత్నకు చికిత్స జరుగుతోందని మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిస్తారని రూమర్లు కూడా వచ్చాయి. కానీ ఆయన ఎప్పుడు కోలుకుంటాడో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. స్పృహలోకి ఎప్పుడు వస్తాడు అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే నందమూరి తారకరత్న స్పృహలోకి రాకపోవడానికి కారణం.. తారకరత్న కుప్పకూలి పడిపోయిన సమయంలో బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొంతమేర డామేజ్ కూడా జరిగిందట. అందుకే ఇప్పటికీ ఆయన స్పృహలోకి రాలేదని చెబుతున్నారు.. ఆయన మెదడు పనితీరు మెరుగుపరచడానికి ఎప్పటిలానే వర్క్ చేయడానికి స్పెషల్ న్యూరాలజిస్ట్ తో చికిత్స కూడా చేయిస్తున్నారట. దానితో పాటు డాక్టర్స్ ,స్పెషల్ టీం ఒకటి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది అని సమాచారం.
ప్రస్తుతం కర్ణాటక హెల్త్ మినిస్టర్ సహాయంతో విదేశాల నుండి ప్రత్యేకంగా వైద్యులను పిలిపించి వారి చేత తారకరత్నకు ప్రత్యేక వైద్య చికిత్సలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే నారాయణ హృదయాలయ హాస్పిటల్ వైద్య బృందం మరో రెండు మూడు రోజుల్లో తారకరత్న తాజా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇదే జరిగితే తారకరత్న ప్రస్తుతం ఎలా ఉన్నాడు ? ఏంటి ? అనేది అభిమానులకు, ప్రజలకు తెలిసే అవకాశం ఉంది.