పాలకూర ఆరోగ్యవ కరమైన ఆకుకూర ఇది విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ తో నిండి ఉంటుంది. కూరగాయల కంటే ఆకుకూరలోనే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. అందులోనూ పాలకూర విషయానికి వస్తే ఇందులో ఎక్కువ పోషకాలు,విటమిన్స్ ఉంటాయి. పాలకూర సూప్ తాగడం వలన శరీరంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి, ఇవి ఆరోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. మరి పాలకూర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మనము తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తి పెంచుతుంది : పాలకూరలో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సూప్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లు జలుబు, దగ్గు, వంటి సమస్యలు తగ్గుతాయి. విటమిన్ సి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కణాలను రక్షిస్తుంది.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది : పాలకూర సూప్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గించడంలో ఈ సూప్ సహాయపడుతుంది. గోరువెచ్చని సూప్ జీర్ణ ఎంజైములను ప్రేరేపిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
రక్తహీనత నివారిస్తుంది : పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. పాలకూరసు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. బలహీనత అలసట తగ్గుతాయి ముఖ్యంగా మహిళలకు ఈ సూప్ ఎంతో ఉపయోగం.
చర్మం ఆరోగ్యం: పాలకూరలో విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు చర్మాని మృదువుగా యవ్వనంగా ఉంచుతాయి. ఈ సూప్ తాగడం వల్ల చర్మంపై మచ్చలు తగ్గి చర్మం పొడిబారి సమస్య తగ్గుతుంది అలాగే జుట్టు రాలడానికి కూడా నివారిస్తుంది జుట్టు బలంగా మెరిసేలా చేస్తుంది.
బరువు తగ్గడం: పాలకూర సూప్ తక్కువ క్యాలరీతో నిండి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది ఆకలి నియంత్రిస్తుంది. జీవక్రీని మెరుగుపరుస్తుంది. రోజు సాయంత్రం లేదా రాత్రి భోజనానికి ముందు ఈ సూప్ తాగడం వల్ల బరువు నియంత్రించవచ్చు.
తయారీ విధానం: ఒక కప్పు పాలకూర ఆకులు శుభ్రంగా కడిగి, మిక్సీ పట్టి ఆ పేస్ట్ ను ఒక కప్పు వాటర్ లో కలిపి మరిగించాలి. టేస్ట్ కోసం కొంచెం మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగొచ్చు. ఎప్పటికప్పుడు ఈ సూప్ ను తయారు చేసుకొని తాగాలి నిల్వ ఉంచిన సూప్ తాగకూడదు. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు పాలకూరను అధికంగా వాడకూడదు. అలాంటి వారు వైద్య సలహా తీసుకొని వాడాలి.
గమనిక: (పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న దగ్గరలోని వైద్యుని సంప్రదించండి.)