వరద సహాయక పనులలో కాంగ్రెస్ శ్రేణులు విరివిగా పాల్గొనాలని సూచించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.బాధితులకు నిరంతరం అండగా ఉండాలని అన్నారు.రాష్ట్రంలో వరదల తీవ్రత భయంకరంగా ఉందని,ప్రజలు ఆస్తులు, పంటలు, ఇళ్లు అన్ని కోల్పోయి నష్టాల్లో ఉన్నారని తెలిపారు.వరద బాధితులకు ఆహారం, పాలు, మంచినీరు, మందులు, నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, బట్టలు ఏది అవసరం ఉంటే అది అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి పని చేయాలని సూచించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా సేవలో సైనికులలాగా పని చేసి ప్రజల అవసరాలు తీర్చాలన్నారు.ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత కష్టాలలో ఉన్నారని అన్నారు.ప్రభుత్వాలు వరద అంచనాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజా అవసరాలు తీర్చడంలో విఫలం అయ్యాయని మండిపడ్డారు.కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కష్టాలను తీర్చడంలో ముందుండి పని చేయాలన్నారు.