దేశ పరిస్థితి బాగోలేదు..కలసికట్టుగా పోరాడుదాం: మమతా బెనర్జీ

-

దేశ పరిస్థితి బాగోలేదు అందరం కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.రంజాన్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బిజెపి పై విరుచుకుపడ్డారు.దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఎంత మాత్రం బాగా లేదని, ఒంటరి రాజకీయాలే ఇందుకు కారణమని అన్నారు.కలకత్తాలోని రైన్- డ్రెంఛ్ద్ రెడ్ రోడ్డులో మంగళవారం జరిగిన ఈద్ ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలెవరూ భయపడవద్దని, మంచి భవిష్యత్తు కోసం అంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు.

“దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమి బాగోలేదు.విభజించి పాలించే విధానాలు, ఒంటరి రాజకీయాలు ఏమాత్రం సరికాదు..భయపడొద్దు కలసికట్టుగా పోరాడుదాం..అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.తాను కానీ, తన పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలకు కష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టదని భరోసా ఇచ్చారు.రెడ్ రోడ్డు లో జరిగిన ఈద్ ప్రార్థనల్లో సుమారు 14 వేల మంది పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news