రాష్ట్రాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లూటీ చేస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు నల్గొండ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ పేరిట గ్రామ గ్రామాన 40 రోజుల పాటు కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర చేస్తోందని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఉత్తమ్. 2023 మే నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయం అంటూ ఉత్తమ్ కుమార్ జోస్యం చెప్పారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లభించక చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి తీరికలేని సీఎం కేసీఆర్.. పంజాబ్ రాష్ట్రంలో నగదు ఇవ్వడం హాస్యాస్పదం అని అన్నారు. టిఆర్ఎస్ ది అసమర్థ పాలన.. రాష్ట్రాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తమ్. ల్యాండ్, సాండ్, మైన్, వైన్ పేరిట గ్రామాల్లో, నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news