తమిళ సూపర్ స్టార్ విక్రమ్ నటించిన సినిమా ‘కోబ్రా’. ఈ నెల 31వ తేదీన థియేటర్లల్లో రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు భారీ క్రేజ్ క్రియేట్ అయింది. అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కళాశాలకు చెందిన విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి ఒక డిమాండ్ చేశారు.
కోబ్రా సినిమా చూడటానికి హోలిడే ఇవ్వాలని ప్రిన్సిపల్‌కు లేఖ రాశారు. దీంతో ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కార్తీకేయ అనే వ్యక్తి ఆ లెటర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ లేఖలో.. ‘ప్రియమైన ప్రిన్సిపల్ గారికి.. మేము కామర్స్ డిపార్ట్ మెంట్స్ స్టూడెంట్స్. ఈ నెల 31వ తేదీన కోబ్రా మూవీ విడుదల కానుంది. సినిమా చూడటానికి సెప్టెంబర్ 1వ తేదీన కళాశాలకు అధికారికంగా సెలవు ప్రకటించండి. ఆ రోజు ఎలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్ చేయకండి. ఆ రోజు మేం కాలేజీ రావడం లేదు. ఇట్లు చియాన్ ఫ్యాన్స్. నోట్: సినిమాకు ఎక్స్ ట్రా టికెట్లు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరూ రండి.’ అంటూ పేర్కొన్నారు.
#Cobra leave letter from st joseph college #ChiyaanVikram @chiyaan pic.twitter.com/r1IblcMECi
— karthikeyan (@karthi7726) August 28, 2022