నిత్యజీవితంలో మనం ప్రవర్తించే విధానం అందరికీ నచ్చకపోయినా మనకు నచ్చేలా ఉండాలి. అలాగే మన సమయాన్ని వృధా చేసేదిగా ఉండకూడదు. అలాంటి కొన్ని అలవాట్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.
బస్ లో ప్రయాణిస్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం చాలా మందికి అలవాటు. అలా అలవాటున్న వ్యక్తిని మాట్లాడించడం అనవసరం. ఎందుకంటే మీరు చెప్పేది వారికి అర్థం కాదు. ఒకవేళ అత్యవసర సమయంలో మీరు పిలిచినా, వాళ్ళు హెడ్ ఫోన్స్ తీయకుండా మాట్లాడుతుంటే మాత్రం వదిలిపెట్టడమే బెటర్. ముందుగా మిమ్మల్ని ఎవరైనా మాట్లాడిస్తేమ్ హెడ్ ఫోన్స్ తీసి మాట్లాడ్డం నేర్చుకోండి.
బస్సు ఎక్కేటపుడు అవతలి వారిని పూర్తిగా దిగనివ్వండి.
మీ ఆరోగ్యం బాలేదని ఆఫీసుకి సెలవు పెట్టి, ఫేస్ బుక్ లో మీ ట్రిప్ గురించి ఫోటోళు పెట్టవద్దు.
ఛాటింగ్ చేసేటపుడు షార్ట్ ఫామ్స్ వాడకండి. సరే అనడానికి కే అని వాడితే, అవతలి వారికి మీరు ఆసక్తిగా లేరేమో అని అనుమానం వస్తుంది.
మీకెవరికైనా చాక్లెట్ బహుమతిగా ఇస్తే, అది వాళ్లతో పాటే పంచుకోండి. అలా పంచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే చాలా మంది చాక్లెట్ ఇస్తుంటారు.
మిమ్మల్ని అడక్కుండా సలహాలు ఇవ్వవద్దు.
క్యూ పాటించండి. మీరు క్యూ పాటించినపుడు అవతలి వారు పాటించకపోతే ఎలా కోపం వస్తుందో ఆలోచించండి.
హోటల్ కి వెళ్ళినపుడు వెయిటర్స్ తో గొడవ పడవద్దు. సర్వ్ చేసిన దానికి థ్యాంక్యూ అని చెబితే ఆ ఎఫెక్ట్ వెయిటర్స్ పై బాగా ఉంటుంది.
నోట్లో చూయింగ్ గమ్ నములుతూ ఎదుటివారితో మాట్లాడకండి.