శరీర జీవక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన టిప్స్..

-

సరిగ్గా ఆలోచించాలన్నా, ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టాలన్నా, అలా మొదలెట్టిన పని ముందుకు జరగాలన్నా శరీర జీవక్రియ బాగుండాలి. మన శరీరంలో ఇది ముఖ్యం కాదు అన్న అంశమే లేదు. ఒకవేళ అలా ఉంటే మొదటిస్థానంలో మెదడుని ఉంచితే రెండవ స్థానంలో జీవక్రియని ఉంచాలి. జీవక్రియ సరిగ్గా జరగకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. అసలు జీవక్రియ అంటే ఏమిటి? పెద్దగా ఏమీ లేదు. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమై జీవించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే. జీవక్రియ సరిగ్గా లేకపోతే రకరకాల వ్యాధులు అటాక్ చేస్తాయి.

వాటి నుండి కాపాడుకోవడానికి మన జీవక్రియని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఫైబర్ ఫుడ్స్

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలని తీసుకోవాలి. పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తింటే మంచిది.

కూరగాయలు

మీ భోజన పళ్లెంలో కూరగాయల శాతం 75ఉండాలి. అలా లేదంటే మీ జీవక్రియకి ఆటంకం వాటిల్లినట్లే. మొక్కల నుండి దొరికే ఆహారాలని తీసుకుంటే జీవక్రియ పనితీరు మెరుగవుతుంది.

మంచికొవ్వులు

ఒమెగా 3 కొవ్వులని ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. ఇవి శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన వ్యర్థాలని బయటకు పంపించివేసి శరీర పనితీరును బాగు పరుస్తుంది.

మంచి నిద్ర

నిద్ర సరిగ్గా లేకపోతే అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కనీసం 7-8గంటల పాటు నిద్రపోతే తాజాగా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల నిద్ర లేకుండా ఉంటే జీవక్రియలో అలజడి చెలరేగుతుంది.

వ్యాయామం

పొద్దున్న లేవగానే కనీసం అరగంట వ్యాయామం అవసరం. భౌతికంగా పరుగెత్తే పనులు ఎక్కువ చేయట్లేదు కనుక కనీసం వ్యాయామం అయినా చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news