ది వారియర్ ఓటీటీ డేట్ ఫిక్స్..!!

-

తమిళ టాప్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా .. కృతి శెట్టి హీరోయిన్గా తెరకెక్కిన బై లింగ్వల్ మూవీ ది వారియర్. ఈ సినిమాను ఒకేసారి తెలుగు , తమిళ్ భాషలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్ ,ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్నో అంచనాల మధ్య జూలై 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం గమనార్హం. దీంతో ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు అయ్యాయని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా థియేటర్ రన్ కూడా కేవలం 15 రోజుల్లోనే ముగియడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఇకపోతే డిజిటల్ రిలీజ్ పై తాజాగా ఒక అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజమైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారట. ఇకపోతే సినిమా థియేటర్ లో విడుదలైన కేవలం 28 రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ ఉండడం గమనార్హం.

ఈ సినిమా ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ స్టార్ మా వాళ్ళు దక్కించుకున్నారు.. ఇక ఈ సినిమా లాభం విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా 1280 పైగా స్క్రీన్ లలో ఈ సినిమా విడుదలైంది.. కానీ విడుదలకు ముందే రూ.41 కోట్ల లాభంతో ఈ సినిమా విడుదల అయింది.

Read more RELATED
Recommended to you

Latest news