ఓరి నాయనో.. ఇల్లంతా బంగారమే..అది కూడా బంగారంతోనే..

-

బంగారం చాలా విలువైంది..మహిళలకు ఛాలా ఇష్టమైనది.. ఆభరణాలను చేయించుకుంటారు.. పెట్టుబడులు, ఆభరణాల రూపంలో బంగారం ఉంటే భద్రత ఉందనుకుంటారు. ఇది మనలాంటి సాధారణ ప్రజల పరిస్థితి.. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా బంగారం తో ఇల్లు కట్టేశాడు.. ఇల్లే కాదు ఇల్లంతా బంగారం మయమే.ఆఖరిని వంట చేసుకునే గ్యాస్ స్టౌవ్ కూడా బంగారమే. పక్కనే ఉన్న పాత్రల గురించి చెప్పనే అక్కరలేదు.అన్ని బంగారమే. ఎక్కడ చూసిని జిగేల్ జిగేల్ మనే బంగారమే ఆ ఇల్లంతా. వియత్నాంలోని ఆ ఇంటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన పట్టిందల్లా బంగారమే అయింది. దీంతో ఆయన తన ఇల్లంతా బంగారంతో నింపేసుకున్నారు. ఎంగ్యూయెన్ వాన్ ట్రూంగ్ అనే వ్యాపారి. కాన్‌థో నగరంలో ఈ బంగారు భవనాన్ని నిర్మించుకున్నారు వాన్‌ ట్రూంగ్. వాన్‌ ట్రూంగ్ ఇంట్లో ప్రతీది బంగారమే. వస్తువులన్నీ పసిడితో తయారు చేయించుకున్న వాన్ ట్రూంగ్ గోడలు, పైకప్పును బంగారంతో తాపడం చేయించాడు.

ఒక్కసారి ఇంట్లోకి అడుగుపెడితే ఎటుచూసినా బంగారమే కనిపిస్తుంది. గ్యాస్ స్టవ్‌తో సహా కిచెన్, హాల్, మెట్లు అన్నీ పసిడి వర్ణంలో మెరిసిపోతున్నాయి. వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులకు ఇప్పుడీ ఇల్లు కూడా ఓ టూరింగ్ స్పాట్‌లా మారింది. బంగారపు ఇల్లు, అందులోని భారీ విగ్రహాలు చూసి దేశ,విదేశ పర్యాటకులు అవాక్కవుతున్నారు.. ఆ ఇంటిని అలా బంగారంతో చెయ్యించారు..మూడేళ్ళు కష్ట పడ్డార కూడా..

అలంకరణకు ఏ వస్తువులు ఉపయోగించాలి…వంటివాటన్నింటినీ పరిశీలించేందుకు అనేక దేశాలు తిరిగారు వాన్ ట్రూంగ్. ప్రపంచంలో మరెక్కడా బంగారపు ఇల్లు లేదని తెలుసుకున్న వాన్ ట్రూంగ్…తన సంపదకు చిహ్నంగా… స్వర్ణపు కాంతులీనే నివాసాన్ని నిర్మించుకున్నారు. ఆరేళ్ల క్రితం వచ్చిన ఆయన ఆలోచనకు నిలువెత్తు బంగారం రూపం ఈ బంగ్లా..ఇలా ఆ ఇంటి గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఈ వీడియోలో ఓ సారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news