బికినీ వ్యాక్సింగ్‌ చేసుకుని ఆసుపత్రి పాలైన యువతి.. చివరకు కోర్టుకు ఎక్కిన రచ్చ..!

-

అమ్మాయిలకు అందానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఎంత తెల్లగా ఉన్నా.. ఇంకా ఏదో చేయాలని తెగ ఆరట పడతారు. ఈ అవాంఛిత రోమాలను తొలగించేందుకు.. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో వ్యాక్స్‌ బాగా ఉంటుంది. ఇది కాస్త కష్టంగా ఉన్నా.. హెయిర్‌ అయితే పోతుంది. అలా ఓ అమ్మాయి బికినీ వ్యాక్సింగ్ చేయించుకోవడానికి వెళ్లి ఆసుపత్రి పాలయింది.. అసలేం జరిగిందంటే..

 

ఏం జరిగింది?

ఇండోర్లోని ఒక మహిళ బికినీ వ్యాక్సింగ్ చేయించుకునేందుకు స్పాకు వెళ్ళింది. ఆ వ్యాక్సింగ్ ఖరీదు ₹4,500. ఈ వ్యాక్సింగ్ చేసేందుకు వేడిగా ఉన్న జిగటలాంటి పదార్థాన్ని శరీరంపై రాసి తర్వాత అక్కడున్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ పదార్ధాన్నే వ్యాక్స్ అంటారు. ఆ పదార్థాన్ని శరీరానికి రాయగానే చాలా మంటగా ఉంటుంది.. ఆ అమ్మాయి..మంటగా ఉందని చెప్పినా వ్యాక్సిన్ చేసే బ్యూటిషియన్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదట. అలానే ఉంటుందని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ బ్యూటిషియన్ చెప్పిందట.. చివరికి వ్యాక్సిన్ చేయడానికి స్ట్రిప్‌ను ఆ జిగటైనా పదార్థంపై ఉంచి లాగగానే వెంట్రుకలతో పాటు చర్మం కూడా ఊడి వచ్చింది. దీంతో ఆ అమ్మాయి నొప్పి, మంటతో విలవిలలాడింది. చివరికి ఆసుపత్రి పాలయ్యింది. తాను చెబుతున్నా కూడా వినకుండా వ్యాక్సింగ్ చేసిందని ఆ స్పా యజమానిపై వినియోగదారుల కోర్టులో కేసు వేసింది.

వినియోగదారుల కోర్టు ఈ మొత్తం కేసుని పరిశీలించి.. నష్టపరిహారంగా 30000 రూపాయలు అమ్మాయికి చెల్లించాలని అలాగే ఆమెకు మానసిక వేదన కలిగించినందుకు మరో 20000 రూపాయలు ఆమె వైద్య చికిత్స కోసం మరో 20000 రూపాయలు… మొత్తంగా 70,000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని స్పా యజమాని నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. సౌందర్య ప్రక్రియలకు వెళ్లే ముందు అవి ఆ చర్మానికి పడతాయో లేదో చెక్ చేయాలని కూడా సూచించింది.

ఏంటీ బికినీ వ్యాక్సింగ్?

బికినీ వ్యాక్సింగ్, బ్రెజిలియన్ వ్యాక్సింగ్ దాదాపు ఒకటే. బికినీ వేసుకునే వారు ఈ వ్యాక్సింగ్ చేయించుకుంటారు. బికినీ వేసుకుంటే ఒంటి మీద ఎక్కడా వెంట్రుకలు కనిపించకుండా ఈ వ్యాక్సింగ్ చేయించుకుంటారు. అందుకే దీన్ని బికినీ వ్యాక్సింగ్ అంటారు. ఈ వ్యాక్సింగ్‌లో భాగంగా జననేంద్రియాల వద్ద ఉన్న వెంట్రుకలను కూడా తొలగిస్తారు. అందుకే ఈ వ్యాక్సింగ్ కేవలం అనుభవం ఉన్నవారితోనే.. చేయించుకోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లోపలి తొడ భాగం, ఎగువ కాలు మధ్య ఉండే బికినీ లైన్ ప్రాంతాన్ని ముఖ్యంగా వ్యాక్స్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news