ఆయనది ముక్కు కాదు తొండం.. 300 ఏళ్లు అయినా చెక్కు చెదరని రికార్డ్‌

-

ఎవరికైనా ముక్కు, మోఖం.. బాగుంటే కలర్ అటు ఇటుగా ఉన్నా బానే ఉంటారు.. ముందు అయితే రూపం బాగుండాలి. కానీ ఇప్పటికీ.. ప్రపంచంలో బాడీలో పార్ట్స్‌ ఎక్కువగా ఉన్నవాళ్లు, చాలా చిన్నగా ఉన్నవాళ్లు.. అనేక మంది ఉన్నారు. అయితే హైట్‌ ఎక్కువగా ఉండటం తక్కువగా ఉండటం కామన్‌.. కానీ ఇతనికి మాత్రం ముక్కు పెద్దగా ఉంది.. అది కూడా అంతా ఇంత కాదు.. చూస్తేనే ఆశ్యర్యపోయేలా..? సాధారణంగా మనుషుల ముక్కు 2 అంగుళాల వరకు పెరుగుతుంది. అయితే ఒక వ్యక్తి ముక్కు మాత్రం ఏకంగా 7.5 అంగుళాల పొడవు పెరిగింది. అంటే దాదాపు అరచేయి అంత పొడవు.

ఇంత పెద్ద ముక్కు ఉన్న ఆ వ్యక్తి పేరు థామస్ వెడర్స్. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ వ్యక్తికి థామస్ వుడ్‌హౌస్‌ అని కూడా పేరు ఉంది.. ఈ వ్యక్తి 18వ శతాబ్దంలో సర్కస్ పర్ఫామర్‌గా జీవించేవాడు. ఆయన ఫొటోనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో చెక్కర్లు కొడుతోంది.

గిన్నిస్ రికార్డ్

ఈ ఫొటో చూస్తుంటే ఏనుగుకి తొండం ఎలా పెద్దగా ఉంటుందో అలా థామస్‌కి ముక్కు చాలా పెద్దగా ఉన్నట్లు కనిపించింది. ఈ పిక్ చూసేందుకు నమ్మేలా లేదు కానీ నిజంగానే థామస్ ముక్కు ఏడున్నర అంగుళాలు ఉండేది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ వెబ్‌సైట్‌లో కూడా అతని గురించి ప్రత్యేకంగా ఒక పేజీ ఉంది. అంతేకాదు, థామస్ తల మైనపు ప్రతిరూపాన్ని లండన్‌లోని రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో పెట్టారు.. థామస్ తర్వాత ఏ మనిషికి కూడా ఇంత పెద్ద సైజులో ముక్కు పెరగలేదు.. అంటే అతని రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ఇప్పటి వ్యక్తి కాదు

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు గల థామస్ కచ్చితమైన పుట్టిన తేదీ ఎవరికీ తెలియదు. థామస్ 1770 కాలంలో ఇంగ్లాండ్‌లో నివసిస్తూ సర్కస్ ప్రదర్శనలు ఇచ్చేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. 300 సంవత్సరాలలో థామస్ రికార్డును ఎవరూ చెరిపేయలేకపోయారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. “అది ముక్కు కాదు ఒక తొండం” అంటూ ఒక యూజర్ అంటే.. వామ్మో ఇంత పెద్ద ముక్కా? ఆ ముక్కుతో నాలుగు రోజుల క్రితం ఏం వంటకాలు వండారో కూడా ఇతను వాసన చూసి చెప్పగలడేమో అంటూ ఇంకొకరు చమత్కరించారు.. అసలు అంత పెద్ద ముక్కుతో ఆయన ఎలా జీవించాడో కదా..!

Read more RELATED
Recommended to you

Latest news