హిందువులు లేకుండా భారతదేశం లేదు, భారతదేశం లేకుండా హిందువులు లేరని, ఇండియా, హిందువులను వేర్వేరుగా చూడలేమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇండియా తన కాళ్లపై తాను నిలబడింది. ఇదే హిందుత్వం సారాంశం. ఈ కారణంగానే ఇండియా హిందువుల దేశం అని పేర్కొన్నారు.
భారతదేశ విభజనపై మోహన్ భగవత్ మాట్లాడారు. దేశ విభజనతో భారత్ ముక్కలైంది. పాకిస్తాన్ ఏర్పడింది. మనం హిందువులం అనే భావనను విస్మరించడం వల్లే దేశ విభజన జరిగింది. ఈ విషయాన్ని ముస్లింలు కూడా మరిచిపోయారు. మొదట హిందువులం అనే భావించే వారి బలం తగ్గింది. ఆ తర్వాత వారి సంఖ్య కూడా తగ్గింది. అందుకే, పాకిస్తాన్ ఎప్పటికీ భారత్‌కు చెందినది కాకుండా పోయింది. హిందువుల సంఖ్య, బలం తగ్గిందా లేక హిందుత్వ భావాలు తగ్గిపోయా అనేది మీరు చూస్తున్నారు. హిందువులు హిందువులుగా ఉండాలంటే భారత్ అఖండ్‌గా మారాలి.