ఈ ఏడాదిలో ఎందరో దిగ్గజానటులు దివికేగారు. వారిలో సినీ పరిశ్రమకు చెందిన ఎందరో దిగ్గజానాటీ నటులు గాయనే గాయకులు టెక్నీషియన్స్ ఉన్నారు వీరందరూ దూరమైన ఈ సంవత్సరం అభిమానులకు ఎంతో బాధాకరంగానే మిగిలిందని చెప్పాలి అయితే ఈ ఏడాది మరణించిన మన సినీ ప్రముఖులు ఎవరో ఓసారి చూద్దాం..
ఈ ఏడాది నవంబర్ 15న మన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కనుమూశారు అలాగే ఇదే ఏడాది సెప్టెంబర్ 11న రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా తుది శ్వాస విడిచారు.. అలాగే నైటింగేల్ ఆఫ్ ఇండియా గా పేరు తెచ్చుకున్న మన గాయని లతా మంగేష్కర్ ఫిబ్రవరి 3న మరణించారు.. అలాగే సంగీత దర్శకుడు విప్పి లహరి 69 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 16న తుది శ్వాస విడిచారు.. ఆయన హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ భాషల్లో సంగీతం అందించారు. 2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన అదేఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్ నుంచి ఎంపీగా పోటీచేశారు
అలాగే బాలీవుడ్లో హాస్యనటుడిగా మంచి పేరు సంపాదించుకున్న రాజు స్త్రీ వాత్సవ సెప్టెంబర్ 21న కన్నుమూశారు అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అరుణ్ బాలి అక్టోబర్ 7న మరణించారు.. అలాగే
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాపై కొందరు దుండగులు తూపాకీతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో 29 మే 2022న ఆయన ప్రాణాలు కోల్పోయారు. అలాగే కేకేగా ప్రఖ్యాతి పొందిన గాయకుడు కృష్ణ కుమార్ కున్నత్ 53 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్‌తో 31 మే 2022న కన్నుమూశారు. ఇదే ఏడాది ప్రముఖ హిందీ టీవీ నటుడు సిద్ధాంత్ సూర్యవంశీ 11 నవంబర్ 2022న జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరణించారు..