కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన ఆహార పదార్థాలు ఇవే..!

-

ప్రస్తుత ఆధునిక జీవనవిధానంలో కొన్నిపనులు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది . అందులో మొదటిది ఆఫీసులో పని ఒత్తిడి.. కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. గంటల తరబడీ కంప్యూటర్, మొబైల్, టీవీ ముందు గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడతారు. దీనితో సరైన నిద్రలేకపోవడంతో కళ్ళ కింద నల్లటి వలయాలు , కంటి చూపు మందగించడం ,కళ్ళ మంటలు, కళ్ళ నుండి నీరు కారటం వంటివి జరుగుతుంటాయి. ఇలా కంటి సమస్యలు ఏర్పడకుండా చిన్న చిన్న ఆహార మార్పులు, జీవనశైలి ఏర్పాటు చేసుకున్నట్లయితే కళ్లఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కళ్ళ ఆరోగ్యానికి పోషక పదార్ధాలు తీసుకోవాలి.అవేంటో ఇప్పుడు చూద్దాం.

నట్స్: బాదాం, ఎండుద్రాక్ష,పిస్తా లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి వాపు ను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని,
కాపాడుతాయి.

వాటర్ ఫిష్ మరియు ఆస్ట్రిచెస్ .. వీటిని కోల్డ్ వాటర్ ఫిష్ అంటారు. వీటిల్లో డిహెచ్ ఎ అనే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన సెల్ డ్యామేజ్ లేకుండా చూసి మాక్యూలర్ డీ జనరేషన్ రాకుండా ఆపటం జరుగుతుంది.

అవకాడో: వీటిల్లో ఉన్న లూటిన్, మాస్కులార్ డీ జనరేషన్ రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న మిగతా పోషక పదార్ధాలు కూడా కంటికి చాలా మంచివి.

ఆకు కూరలు :బచ్చలి కూర, దుంప బచ్చలి. కాలే, స్విస్ చార్డ్, టర్నిప్, ఆవాలు మరియు కొల్లార్డ్ గ్రీన్ ఇవన్నీ కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అసలు పచ్చటి ఆకు కూరలేవయినా మంచివే. వీటిల్లో ఉండే లూటిన్, సెల్ డ్యామేజ్ ని అరికడుతుంది.

ఉల్లిపాయ: వెల్లుల్లి, ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ గ్లూటథియొనో ఉత్పత్తి చేసే యాంటిఆక్సిండెంట్స్ కంటి చూపుకు చాలా ఉపయోగకరం.

దుంపలు: బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిలో కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల కాటరాక్ట్స్ ను తొలగిస్తుంది. అంతే కాదు సాధారణ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

రెడ్ వైన్: డార్క్ చాక్లెట్ లాగే రెడ్ వైన్ లో కూడ అధికశాతంలో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి కార్నియాను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయం చేస్తాయి.

గుడ్లు: వీటిల్లో ఉన్న ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ డిహెచ్ ఎ, ల్యూటిన్ మరియు జియాక్సిథిన్ కళ్ళకి చాలా మంచివి.

Read more RELATED
Recommended to you

Exit mobile version