ఓటిటి ప్లాట్ ఫామ్ లు వచ్చిన తర్వాత ప్రతి సినిమా కూడా థియేటర్లలో విడుదలైన నాలుగు లేదా ఆరు వారాలలోపే ఓటీటీ లలో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో చాలామంది థియేటర్లకంటే ఓటీటీ లోనే సినిమాలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లకైతే ఎక్కువ ఖర్చు పెట్టి కుటుంబ సభ్యులతో సహా వెళ్లి సినిమాలు చూడలేరు. కాబట్టి ఇలా ఓటిటిలోనే ఇంట్లో అందరితో సంతోషంగా చూడవచ్చునే నేపథ్యంలో ఓటిటిలకే పరిమితం అవుతూ ఉండడం గమనార్హం. మరి ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను సందడి చేయడానికి థియేటర్లలో అలాగే ఓటిటి వేదికగా విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు..
రామారావు ఆన్ డ్యూటీ:
మోస్ట్ అవైటెడ్ సినిమాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల కానుంది.
ది లెజెండ్:
అరుళ్ శరవనన్ , ఊర్వశి రౌటేల హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం ది లెజెండ్ . ఇక ఈ సినిమా జూలై 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది..
ఇక ఇదే రోజున సుదీప్ , నిరూప్ భండారీ , నీతా అశోక్, జాక్వేలిన్ ఫెర్మాండేజ్ కలసిన విక్రాంత్ రోణ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది.
ఓటీటీ వేదికగా విడుదల కాబోతున్న సినిమాలు..
రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 26వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.
గుడ్ లక్ జెర్రీ.. జూలై 29వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
777 చార్లీ .. జూలై 29వ తేదీన వూట్ , నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
డ్రీమ్ హోమ్ మేకోవర్.. జూలై 27వ తేదీన నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
షికారు..జూలై 29వ తేదీన ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
19 (1)(a) .. జూలై 29వ తేదీన డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానుంది
ఇక వీటితోపాటు మరికొన్ని ఇంగ్లీష్, హిందీ వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ వేదికగా ప్రసారం కానున్నాయి.